రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

0

cm ramoji

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్, జూన్ 8 (న్యూస్ బ్యూరో ):: ఈనాడు గ్రూప్ అధినేత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని తెలిపారు.రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎస్ శాంతి కుమారిని సిఎం రేవంత్ ఆదేశించారు. దీంతో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ సూచించారు. ఇప్పటికే రామోజీరావు పార్ధీవ దేహం ఫిల్మ్ సిటీకి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *