యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బిజెపి
నీట్ ఫలితాల్లో అవకతవకలు……
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుగులోత్ హర్ష నాయక్….
కారేపల్లి ధ్వని న్యూస్:యువత భవిష్యత్తుతో బీజేపీ ఆటలాడుతున్నదని స్టూడెంట్ల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేయాలని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుగులోత్ హర్ష నాయక్ డిమాండ్ చేశారు.వైద్య విద్య ప్రవేశాల కోసంనిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2024 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.దీనిపై వస్తున్న కంప్లైంట్లపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీకైందనీ అలాగే వెలువడిన ఫలితాల్లోనూ స్కామ్ జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు. దీనికి ఉదాహరణ ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై పలుఅనుమానాలువ్యక్తమవు తూన్నాయనితెలిపారు.దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందన్నారు. యువతభవిష్యత్తుతోబీజేపీఆటలాడుతున్నదని నీట్ సహా అనేకపరీక్షల్లోపేపర్లీకేజీలు,అవినీతి ఎక్కు వైందన్నారు.దీనిపై ఉన్నతస్థాయి అధికారులు దర్యాప్తుజరపాలని హర్ష నాయక్ డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు రమేష్, ఎన్ఎస్ యు ఐమండలఅధ్యక్షుడుసాయికిరణ్, యువజనకాంగ్రెస్ మండలనాయకులు రాజేష్ నాయక్,రాజ్ కుమార్,రఘు,అనిల్ తదితరులు పాల్గొన్నారు.