ముఖ్యమంత్రితో కాంగ్రెస్ ఎంపీల భేటీ
ధ్వని ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్, జూన్ 8 (న్యూస్ బ్యూరో )::
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన ఎంపీలు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల పరిణామాలపై చర్చించారు. ఎన్నికల్లో తమకు సహకరించినందుకు వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో డాక్టర్ మల్లు రవి, రఘురామిరెడ్డి ,కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్ ,రాజ్యసభ సభ్యులు
అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.