మీడియా దిగ్గజం తెలుగు తేజం రామోజీ కన్నుమూత
నేడు అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
మీడియా , సినీ , వ్యాపార రంగంలో దిగ్గజ వ్యక్తిగా గుర్తింపు
భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రముఖుల సంతాపం
ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్ , జూన్ 8 (న్యూస్ బ్యూరో):
అనారోగ్య సంబంధిత సమస్యలతో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థత నేపథ్యంలో ఆయనను హైదరాబాద్ నానకరం గూడ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చడం గుండెకు సంబంధించి ఆయనకు స్టంట్ కూడా వైద్యులు అనంతరం పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్సను అందించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రామోజీరావు ఉదయం మృతి చెందినట్లు వైద్యులు మీడియా మొఘల్ గా ప్రసిద్ధి చెందిన రామోజీ రావు మృతి పట్ల
భారత రాష్ట్రపతి ద్రౌపది మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంటి నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. రామోజీరావు మృతి పట్ల దేశ , అంతర్జాతీయ స్థాయిలో కూడా సంతాపాలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు రామోజీరావు ఆకస్మిక మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం రామోజీ ఫిలిం సిటీ లో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అనంతరం రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు.అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. “రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారు. తెలుగు పారిశ్రామికరంగానికి రామోజీ విలువలు జోడించారు. మీడియా రంగంలో రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. రామోజీరావు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించాం.” – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సృజనాత్మకతలో కూడిన వ్యక్తిత్వం రామోజీరావు సొంతం : భట్టి
మారుమూల ప్రాంతంలో జన్మించిన రామోజీరావు విలక్షణమైన, సృజనాత్మకతలో కూడిన వ్యక్తిత్వం ఆయన సొంతమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు నాట అనేక సంచలనాలకు రామోజీరావు మూల స్తంభమని చెప్పారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని సృష్టించారని, వ్యాపార రంగంలో నమ్మకానికి మరో పేరుగా నిలిచారని గుర్తు చేశారు. అద్భుతమైన ఫిల్మ్ సిటీని సినీరంగాల్లో చెరగని ముద్రవేశారని అన్నారు. పనిలోనే తనకు విశాంత్రి అనే ప్రాథమిక సూత్రంపైనే రామోజీరావు చివరి శ్వాస వరకు పవిచేశారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
రామోజీరావు మరణంపై మంత్రి జూపల్లి సంతాపం
రామోజీరావు మరణంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. రామోజీరావు జీవితం మొత్తం విలువలు, నిబద్ధత, క్రమశిక్షణ, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, నెతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలుగు పత్రిక, టెలివిజన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన సృజనాత్మకత రూపశిల్పి అని పేర్కొన్నారు. రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.