ప్రశాంతంగా గ్రూప్​-1 ప్రిలిమినరీ పరీక్ష

0

grup

హైదరాబాద్,ధ్వని న్యూస్ :రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ గ్రూప్​-1 పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగిసింది. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పరీక్షలు జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రానిక్​ గాడ్జెట్స్​ను పరీక్షా కేంద్రం లోపలికి తీసుకెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రూప్​-1 పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. 10.15 గంటలకు గేట్లు మూసివేశారు. అభ్యర్థుల బయోమెట్రిక్‌ వివరాలు తీసుకుని కేంద్రంలోకి పంపించారు.అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను, ఐడీ కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటరే తుది నిర్ణయం తీసుకుంటారు. పరీక్షకు ముందు ఇన్విజిలేటర్‌ సమక్షంలో అభ్యర్థి హాల్‌టికెట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.అనంతరం ఇన్విజిలేటర్‌ కూడా సంతకం చేస్తారు. హాల్‌ టికెట్‌పై ఉన్న ఫొటో, అభ్యర్థి అతికించిన ఫొటో, సంతకం, నామినల్‌ రోల్‌ ఫొటో, ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డుపై ఫొటో, సంతకాలు సరిపోలాలి. ఈ విషయంలో పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్‌ సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అవకాశముంది.పరీక్షను నిఘానేత్రాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలు కూడా మూసివేయాలి. ప్రతి కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *