ప్రభుత్వం డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పై విచారణ జరపాలి.

0

pdsu

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్.
నిజామాబాద్ జూన్ 9 ధ్వని న్యూస్ జిల్లా ప్రతినిధి :నిజామాబాద్ నగరంలో గల డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పైన విచారణ చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, నిజామాబాద్ డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ చేసిన అన్యాయ, అక్రమాల మీద విచారణ చేపట్టాలని నెల రోజులు ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణను మోస్ట్ అర్జంట్ ఎంక్వయిరీ అని ఆర్జెడి, వరంగల్ గారికి పంపడం జరిగిందని తెలిపారు. కానీ నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వ డైట్ ప్రిన్సిపల్ మీద ఎటువంటి విచారణ చేపట్టకపోవడం, ఆర్జెడి, వరంగల్ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో విద్యార్థులను డైట్ కళాశాల ప్రిన్సిపల్ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని మతపరమైన భేదాలు చూపెడుతున్నారని జిల్లా కలెక్టర్లకు విన్నవించడం జరిగిందన్నారు. అదే తరుణంలో పిడిఎస్యు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు, కళాశాలలో ధర్నాలు, వినతి పత్రాలు, రాష్ట్ర ఉన్నత అధికారులకు కూడా విన్నవించడం జరిగిందన్నారు. దాని మూలంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రెండు కమిటీలు డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మీద విచారణకు వేయడం జరిగిందన్నారు. కానీ ఈ విచారణ, దాదాపు 34 సంవత్సరాలుగా ఇక్కన్నే తిష్ట వేసిన ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్ ని మాత్రమే విచారణ చేయడం జరిగింది. కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వారితోపాటు, విద్యార్థులను కూడా ఎటువంటి సమగ్ర విచారణ చేపట్టకుండా మాత్రమే విచారణ పూర్తి చేశారన్నారు. ఇష్టం వచ్చిన విధంగా నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. డైట్ కళాశాలలో నీ ట్రైనీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికే అదనపు బాధ్యతలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. డైట్ కళాశాలల్లో ఒకేషనల్ స్క్రాప్ సామాన్లు పై అధికారుల అనుమతి లేకుండా అమ్మడం జరిగిందన్నారు. కళాశాలలోని చాలా వరకు చెట్లను అటవీ శాఖ అధికారుల అనుమతి లేకుండా కొట్టి వేసి అమ్మడం జరిగిందన్నారు. ఈ విధంగా అనేక రకాలుగా విద్యార్థి ట్రైనీలను, సిబ్బందిని మానసికంగా వేధింపజేస్తున్నారు,కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పి.డి.ఎస్.యు. గా డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *