నిరుద్యోగులకు ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి

0

vital

బిజెపి  రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సీ.హెచ్ విఠల్ డిమాండ్

ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్ , జూన్ 8 (న్యూస్ బ్యూరో):;ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన 2 లక్షల 50 వేల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని బిజెపి  రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సీ.హెచ్ విఠల్ డిమాండ్ చేసారు.శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో ఆఉఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక రకాల హామీలిచ్చారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులు, నిరుద్యోగులకు సంబంధించి ప్రధానంగా హామీలిచ్చారు. వివిధ రకాల డిక్లరేషన్లు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలను పూర్తిచేయకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆక్రోశానికి గురయ్యారు.రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు బీఆర్ఎస్ సర్కారుపై కక్షగట్టి గద్దెదించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోవడం లేదు.2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, నిరుద్యోగ భృతి అమలు, టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన, డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలను ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.కాని, 6 నెలలు గడిచినా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతో మాత్రమే ఖాళీ ఉద్యోగాలను పూరించింది తప్పితే.. ఇప్పటివరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2 లక్షల ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 2 తారీఖు లోగా నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి సెప్టెంబరు 17 లోగా నియామకపత్రాలు ఇస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది..? 2 లక్షల ఉద్యోగ ఖాళీల్లో 200 కూడా పూరించలేదు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచింది.జూన్ మాసం తర్వాత పెద్దఎత్తున ఉద్యోగులు (సుమారు 50 వేల మంది) రిటైర్ కాబోతున్నారు. దీంతో గతంలోని 2 లక్షల ఉద్యోగ ఖాళీలకు తోడు అదనంగా 50 వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి.అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 50 వేల ఖాళీలను ఎప్పుడు నింపుతారనేది సమాధానం చెప్పాలి.గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మోసపోయిన నిరుద్యోగుల పక్షాన ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, నిరుద్యోగ భృతి అమలు కోసం, టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన కోసం బిజెపి పోరాటం చేసింది.రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆక్రోశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం కూడా అన్యాయమే చేస్తోంది.ఇన్నిరోజులు ఎన్నికల కోడ్ సాకుతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసింది.రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఆవేదనతో కుమిలిపోతున్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల 50 వేల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ విటల్ డిమాండ్ చేసారు.లేదంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల తిరస్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

రామోజీ రావు మృతి తీరనిలోటు

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతిపట్ల సీ.హెచ్ విఠల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈనాడు గ్రూప్ అధినేత శ్రీ రామోజీరావు గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. రామోజీ కుటుంబ సభ్యులు, ఈనాడు గ్రూప్ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.మీడియా, సినిమా, వ్యాపార, సామాజిక సేవా రంగంలో రామోజీ రావు గారి సేవలు ఎనలేనివన్నారు.రామోజీ జీవితమే ఒక క్రమశిక్షణతో కూడుకున్నది.. ఈనాడు సంస్థలో పనిచేసిన సిబ్బంది కూడా క్రమశిక్షణతో పనిచేస్తారని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *