దటీజ్ పెమ్మసాని చంద్రశేఖర్
మోడీ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా ఛాన్స్
ఇక గుంటూరు, మంగళగిరిలకు నవశకమే
అమరావతి, (ధ్వని న్యూస్):ప్రస్తుత పరిస్థితుల్లో ఆంద్రప్రదేశ్ తో పాటు యావత్ భారతదేశంలోనే పరిచయంతో పనిలేని నాయకుడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ లో చోటు దక్కింది.ఉమ్మడి గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో నాడు కేంద్ర మంత్రిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండే వారు .అయితే యాదృచ్చికంగా ఆయన అల్లడు కిలారి రోశయ్యపై విజయకేతనం సాదించిన డాక్టర్ అదృష్టమో అనూహ్యంగా కేంద్రంలో మంత్రిగా అవకాశం లభించింది.ఆయనే మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దాదాపుగా భారతదేశంలో కోటిశ్వర్లలో ముందుకు దుసుకువచ్చి ప్రజల చేత మన ఆంద్రప్రదేశ్, అందులోను గుంటూరు మిరప ఘాటు చూపించనున్నారు పార్లమెంటులో.కేవలం తొలి అడుగులోనే బంపర్ ఆఫర్ కొట్టిసి lన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రబాబుకి ఎవరిపైనైనా నమ్మకం కావాలంటే చాలా కష్టపడాలి.కాని అవేమి పెమ్మసానికి అవసరం లేకుండానే తొలి విజయంతో ఏకంగా అధినేత మనసుతో పాటు మంత్రి పదవి దక్కించుకోవటం ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో చర్చకు దారితీసింది.చిన్నబాబు విజయంలో పాలుపంచుకోవటంతో పాటు అధినేత ఆశీస్సులతో ఈ సంపద లోనే కాదు, పధవులలో కూడా తొలి వరసలోనే ఉండటంతో ఆయన సొంత నియోజకవర్గం తెనాలి బుర్రిపాలెంలో హర్షాతిరేకాలు పెల్లుబికిన్నాయి.రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని సహాకారంతో ఆంద్రప్రదేశ్ ఏ రంగంలో ముందుకు సాగుతోంది చూడాల్సిందే అంటు అప్పుడే ఆసక్తికర చర్చ నడుస్తోంది.