జాతీయ మెగా లోక్ అదాలత్ లో (5322) కేసులు పరిష్కరించబడినాయి :
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
సిద్దిపేట (ధ్వని న్యూస్) జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ కోర్టు విచారణలో ఉన్న కేసులలో ఐపీసీ కేసులు (652) ఈపెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన తదితర పెట్టి కేసులు (4670) మొత్తం కేసులు (5322) పరిష్కరించబడినాయి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించబడినాయి తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను సిబ్బందిని కమిషనర్ అభినందించారు.త్వరలో కోర్టు సిబ్బందికి రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు