గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసాయి :
జిల్లా కలెక్టర్ మానవ చౌదరి : అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్
సిద్దిపేట (ధ్వని న్యూస్) జిల్లాలో టిజిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 21 కేంద్రాల్లో నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల జిల్లా నోడల్ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ లు వేరువేరుగా సందర్శించి పరీక్షల పనితీరును, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన వసతులను, సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ పరిశీలించిన పరీక్ష కేంద్రాలు వికాస్ హై స్కూల్, న్యూ జనరేషన్ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇందూరు ఇంజనీరింగ్ కాలేజ్ లలో నిర్వహిస్తున్న పరీక్షను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లాలో మొత్తం 8230 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ కేటాయించగా వారిలో 81.38 శాతంతో 6705 మంది పరీక్షకు హాజరై పరీక్ష రాశారని, 1534 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు