కంటతడి పెట్టిన గ్రూప్ వన్ విద్యార్థి
ధ్వని న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని సెయింట్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు నిమిషాలు ఆలస్యమైందని గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థిని గేటు లోపలికి పోలీసులు అనుమతించలేదు. ఆమె అధికారులను బ్రతిమిలాడిన కూడా లోపలికి అనుమతించకపోవడంతో గ్రూప్ వన్ అభ్యర్థి కంటతడి పెట్టుకుంది. ఇన్ని రోజుల నుండి కష్టపడి చదువుకున్నాను పరీక్ష రాయడానికి వస్తే టైం అయిపోయిందంటూ లోపలికి అనుమతించకపోవడంతో బాధ కలిగిందని గ్రూప్ వన్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది.