ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవేసి నీ కలిసిన నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలు…
నిజామాబాద్ ధ్వని న్యూస్ జిల్లా ప్రతినిధి : ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవేసి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలుపొందిన నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షకీల్ ఆమీర్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ఈద్రిస్ ఖాన్ మరియు మున్సిపల్ కార్పొరేటర్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ని వారి నివాసం దారు సలాం లో పూలమాలలు శాలువాలతో సన్మానించడం జరిగిందన్నారు… హైదరాబాద్ లో తిరుగులేని పోరాటం చేసి బిజెపి పార్టీ అభ్యర్థి మాధవి లత ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ స్థానిక ప్రజలు హిందూ ముస్లింలుగా ఎన్నో అవమానాలకు గురి చేసినప్పటికీ స్థానికులు మాత్రం అసదుద్దీన్ ఓవైసీకి భారీ ఓటు మెజారిటీతో పట్టం కట్టారన్నారు…. దారు సలాం హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఆదివారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందన్నారు… అనంతరం నిజామాబాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందన్నారు… రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ గట్టి పోటీ ఇవ్వనున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పలు సూచనలు సలహాలు ఇచ్చారన్నారు… నిజామాబాద్ జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ షకిల్ అమీర్…