ఆయిల్ ఫామ్ హబ్ గా సిద్దిపేట
రైతులకు పంట పెట్టుబడి సాయం విడుదల చేయాలి -మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట జూన్ 10 ( ధ్వని న్యూస్ ) :సిద్దిపేట ప్రాంతం ఆయిల్ ఫామ్ హబ్ గా మారనుందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొట్ట మొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.11,268 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుతో మన జిల్లా, ఖమ్మం తరవాత రెండో స్థానంలో ఉన్నామన్నారు.ఆయిల్ ఫామ్ బీజం వేసింది ఇక్కడేనని ఫ్యాక్టరీ ఇక్కడే రావడం సంతోషంగా ఉందన్నారు.ఆయిల్ ఫామ్ సాగులో సిద్దిపేట ఆదర్శంగా నిలిచిందని, కోనసీమ గా ఈ ప్రాంతం మారుతుందన్నారు.మన దేశంలో 40శాతం మాత్రమే ఉత్పత్తి అవుతుoడ గా , 60 శాతం దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.ఆయిల్ ఫామ్ పంట అంటే చాల మంది రైతుల్లో అనుమానాలు ఉండేవన్నారు.ఖమ్మం సహా ఏపీలోని ప్రాంతాల్లో రైతులు ఈ పంట వల్ల లాభాలు పొందుతున్నారన్నారు.మన రాష్ట్రంలో కూడా రైతులు లాభం పొందాలని ఇక్కడ ప్రారంభం చేశామన్నారు.ఆయిల్ ఫామ్ ప్రకృతి ప్రసాదించిన వరమని, రైతులు ఎదగడానికి ఎంతో దోహదపడుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నదని అన్నారు. అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ ఇవ్వాల్సిందేనన్నారు.