తెలంగాణలో ఎల్లో ఆలర్ట్

0
yellow ele
FILE PHOTO

ఐదురోజులు వర్షాలకు అవకాశం
హైదరాబాద్(ధ్వని న్యూస్): తెలంగాణలో రాగల ఐదురోజు లు పాటు ఒక మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కోస్తాంధ్రను ఆ నుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. గో వా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు-పడమర ద్రోణి బలహీనపడిందని తెలిపింది.ఈ క్రమంలో రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో మోస్త రు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిం ది. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల గంటకు 40-నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. బుధవారం నాడు రా ష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖ మ్మం, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉ రుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వే గంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభా గం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *