రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తాం
ఐ పి ఏం సేవలను ఆధునికరిస్తాం
హైదరాబాద్,(ధ్వని న్యూస్):రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలను పెంచుకోవాలి.ప్రపంచ రక్త దాన దినోత్సవం (జూన్ – 14) ను ఘనంగా నిర్వహించాలి .అన్ని జిల్లా కేంద్రాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించాలి .ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను కొంపోనేనట్స్ అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు అదేశం .రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని తన కార్యాలయంలో రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల పనితీరు ,నిర్వహణ, బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను కొంపోనేనట్స్ అప్ గ్రేడ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్లడ్ బ్యాంకుల (63) పనితీరు, నిర్వాహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూన్ 14 న జరిగే ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో రక్తదాన ఆవశ్యకతపై అవగాహన సదస్సులను నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను కోరారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్త నిల్వలను పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోoగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ R V కర్ణన్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ఐపీఎమ్ డైరెక్టర్ డాక్టర్ శివ లీల, మెడికల్ అండ్ హెల్త్ అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ లు పాల్గొన్నారు.