పుంజుకుంటాం
బి.ఆర్.ఎస్. కు ఉజ్వల భవిష్యత్తు
కొందరు పార్టీ మారినంత మాత్రాన నష్టం లేదు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
ఎమ్మెల్యేలతో భేటీ
గజ్వేల్ టౌన్, (ధ్వని న్యూస్):భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో చోటుచేసుకున్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధినేతను కలిశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదని గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ సమావేశమై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై చర్చించారు. అలాగే బీఆర్ఎస్లో జరుగుతున్న తాజా పరిణామాలపై సమాలోచనలు చేశారు.ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కేసీఆర్ నేతలతో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కు మళ్లీ మంచి రోజులు వస్తాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తరచూ కలుస్తానని కేసీఆర్ అన్నారు.కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద్, గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ షేరి సుభాశ్ రెడ్డిలతో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరందరికీ మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని ఎమ్మెల్యేలతో చెప్పారు.