భారత ఆర్మీ కొత్త అధిపతిగా ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ (న్యూస్ బ్యూరో):భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రసుత్తం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే ఈనెల 30తో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. ఈనెల 30న కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. 1964 జులై 1న జన్మించిన ఉపేంద్ర, 1984 డిసెంబరు 15న జమ్ముకశ్మీర్ రైఫిల్స్ దశంలో చేరారు. 40 ఏళ్ల తన సర్వీసులో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం అందుకున్నారు.