తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు – ఐపీఎస్ లకూ స్థానచలనం

0
IAS IPS
File photo

హైదరాబాద్ (ధ్వని న్యూస్): రాష్ట్రంలో బదిలీల పర్వం మళ్లీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది జిల్లా కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐపీఎస్ అధికారులనూ బదిలీ చేయనున్నట్లు సమాచారం.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు అధికారులను మార్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో బదిలీ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్నికలు ముగిసినందున పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా భారీ ఎత్తున ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది.

బదిలీ అయిన కలెక్టర్లు వీరే :

ఖమ్మం కలెక్టర్‌- ముజామిల్‌ ఖాన్‌

నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌- సంతోష్‌

భూపాలపల్లి కలెక్టర్‌- రాహుల్‌శర్మ

కరీంనగర్‌ కలెక్టర్‌- అనురాగ్‌ జయంతి

పెద్దపల్లి కలెక్టర్‌- కోయ శ్రీహర్

జగిత్యాల కలెక్టర్‌- సత్యప్రసాద్‌

మంచిర్యాల కలెక్టర్‌- కుమార్‌ దీపక్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌- విజయేంద్ర

హనుమకొండ కలెక్టర్‌- ప్రావీణ్య

నారాయణపేట కలెక్టర్‌- సిక్తా పట్నాయక్‌

సిరిసిల్ల కలెక్టర్‌- సందీప్‌కుమార్‌ ఝా

కామారెడ్డి కలెక్టర్‌- ఆశిష్‌ సంగ్వాన్‌

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌- జితేష్‌ వి పాటిల్‌

వికారాబాద్‌ కలెక్టర్‌- ప్రతీక్‌ జైన్‌

నల్గొండ కలెక్టర్‌- నారాయణరెడ్డి

వనపర్తి కలెక్టర్‌- ఆదర్శ్‌ సురభి

సూర్యాపేట కలెక్టర్‌- తేజస్‌ నందలాల్‌ పవార్‌

వరంగల్‌ కలెక్టర్‌- సత్య శారదాదేవి

ములుగు కలెక్టర్‌- దివాకరా

నిర్మల్‌ కలెక్టర్‌- అభిలాష అభినవ్‌

బదిలీ అయిన కలెక్టర్లలో వి.పి.గౌతమ్, పి.ఉదయ్ కుమార్, పమేలా సత్పతి, భవేష్ మిశ్రా, యష్మీన్ బాషా, జి.రవి, హరిచందన దాసరి, ఎస్.వెంకటరావు, తిరుపతికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. త్వరలో మరికొందరు కలెక్టర్లు సహా రాష్ట్రస్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా త్వరలో జరగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో భారీగా బదిలీలు జరిగాయి. ఆరు నెలల పనితీరుతో పాటు వివిధ పరిస్థితులు, సమీకరణలతో మరోసారి భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది. ఎన్నికల నిబంధనలకు మేరకు బదిలీ చేసిన అన్ని శాఖల్లోని వివిధ స్థాయి ఉద్యోగులకు త్వరలో పెద్ద ఎత్తున స్థాన చలనం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో ఆరుగురు అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సహాయ కార్యదర్శులకు (అసిస్టెంట్‌ సెక్రటరీలకు) ఉప కార్యదర్శులు (డీఎస్‌లు)గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిని గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాలు, పురపాలక, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల్లో కేటాయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *