parlament
file photo

                                                     23 నుంచి పార్లమెంట్ సమావేశాల తొలి సెషన్ షెడ్యూల్

న్యూఢిల్లీ, (ధ్వని న్యూస్ బ్యూరో):పార్లమెంట్ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. జూన్ 24 నుంచి జులై 3వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సెషన్​లో స్పీకర్ ఎన్నిక, కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు .ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు కూడా ఇప్పటికే ప్రధానమంత్రి శాఖలను సైతం కేటాయించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *