విజయవంతంగా ముగిసిన ‘ఆటా’ ఉత్సవాలు
అమెరికా ఆట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో ఈ నెల 7,8,9, తేదీలలో జరిగిన ‘ఆటా’ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు మరియు ఆట్లాంటా ఎమోరి యూనివర్శిటీ నుండి పద్మభూషన్ ప్రొఫెసర్ జగదీష్ సేతి, తెలంగాణ ఐఎంటి నుండి ప్రొఫెసర్ శ్రీహర్షరెడ్డి, తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, అట్లాంటా కౌన్సిల్ జనరల్ రమేష్‌బాబు, ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్ జయంత్ చల్లా, ఆటా ప్రెసిడెంట్ శ్రీ మధు బొమ్మినేని,కన్వీనర్ కిరణ్ పాశం, సినీ నటులు హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, ఆటా రిజిస్టేషన్ ఛైర్‌మెన్ శ్రీమతి అనుపమ సుబ్బాగారి, ప్రముఖ ఆటా ప్రముఖులు ప్రైమ్‌హెల్త్ కేర్ ఛైర్‌మెన్ డాక్టర్ ప్రేమసాగర్‌రెడ్డి, ఫైళ్ళ మల్లారెడ్డి,హన్మంతరెడ్డి, మాజీ ఎంపి ఆత్మచరణ్‌రెడ్డితో పాటు శుభలాబ్.ధ్వని దినపత్రికల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సాయికుమార్ రెడ్డి,ఎఫిషెన్స్ డైరెక్టర్ రమేష్‌గుడె తదితరులు పాల్గొన్న ఈ సంభరాల్లో వినూత్న చైతన్యం నింపిన, వైవిద్యం నిండిన సాంస్కృతిక కార్యక్రమాలు, సమ్మోహన పరిచే సంగీత, నాట్య కచేరీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సందడి, సాహిత్య సభలతో, వాణిజ్య, హెల్త్ సదస్సులు, మహిళా, యువత, కార్యక్రమాలతో పసందైన తెలుగు వంటకాలతో మరిచోపోలేని మధురానుభూతితో అహ్లాదంగా ఆటాసభలు విజయవంతంగా జరిగాయి