తెలుగుతేజం చెరుకూరి రామోజీరావు, ఆంధ్రజాతికే ఆభరణం!
ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీ, తన స్వీయప్రతిభతో ఒక్కొక్క శిఖరం అధిరోహిస్తూ, అనేకానేక రంగాలలో అద్భుత విజయాలను సాధిస్తూ, ఆరుదశాబ్దాలుగా తెలుగు భాషకు, సంస్కృతికి, తెలుగువారి కార్యదక్షతకు, ఈసువిశాల భారతావనిలో అద్భుతమైన గుర్తింపు సాధించి, అందించిన మహోన్నత వ్యక్తి!వర్గ, ప్రాంత భేదాలకతీతంగా, చెరుకూరి రామోజీరావు అనే పుణ్యజీవి, ప్రతి తెలుగుజాతీయుడికి ప్రాతఃస్మరణీయుడు!1964లో స్థాపించిన మార్గదర్శి సంస్థలద్వారా, గత ఆరు దశాబ్దాలుగా లక్షలాది మందికి ఉపాధికల్పించిన ఈ మార్గదర్శి ప్రతిభాపాటవాలను, దూరదృష్టిని కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా మనసారా కీర్తించని తెలుగువారు అరుదు!1974లో భారతసమాజానికి ఆనాడు పరిచయం చేయబడిన పత్రికారంగ విప్లవం “ఈనాడు”! ఐదు దశాబ్దాలుగా దానికి కర్త, కర్మ, క్రియ తానయి నిల్చి, కోట్లాది ప్రజలకు స్ఫూర్తినందించుతూ, ప్రతినిత్యం వెలుగొందుతూ నిలిచిన మహాధ్బుత తెలుగుతేజం చెరుకూరి రామోజీరావు!ఒకవ్యక్తి సామాన్యస్ధాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సాధించిన మహాద్భుతం రామోజీ ఫిల్మ్ సిటీ! ఆగొప్పదనాన్ని, ప్రతిభను వర్ణించడానికి మాటలు చాలవు! ఆంధ్రజాతికి ప్రకృతిమాత అందించిన అద్భతవరం చెరుకూరి రామోజీరావు!జీవితంలో ఎదురయిన అనేకానేక ఆటుపోట్లకు వెరవక, తాను నమ్మిన సిద్దాంతం గురించి రాజీపడకుండా జీవిత పర్యంతం నిలబడిన రామోజీరావు గారి జీవితచరిత్ర ప్రతి తెలుగుజాతీయుడికి ప్రతినిత్యం మననం చేసుకోవలసిన ఒక ఉద్గ్రంధం!రామోజీరావు అనే చారిత్రక పురుషుడు మానవ సహజమైన సంకుచిత భావాలకు అతీతమైన ఒక జాతీయశక్తిగా పరిగణించ వలసిన మహోన్నత వ్యక్తి, యావత్తు తెలుగుజాతి గర్వించదగ్గ జాతిరత్నం!ఆస్ఫూర్తిదాయకమైన వ్యక్తి సాధించిన విజయపరంపరను అచంచలంగా కొనసాగించే దిశగా కృషిచేయడం, సాధించడం వర్గప్రాంతాలకు అతీతంగా ప్రతి తెలుగు జాతీయుడి కర్తవ్యం!
కంభంమెట్టు త్రినాధ్ రెడ్డి
M.A., M.A., LL.B.
Advocate, Telangana High Court