పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ
ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్,(న్యూస్ బ్యూరో):సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ మిస్టర్ ఫర్నాండేజ్ భేటీ అయ్యారు . పెట్టుబడులు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది.