అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు
అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం
రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్, (ధ్వని న్యూస్ ):కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా మరియు మహిళా సాధికారిక భవనాలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి వార్డులో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించి వాటికి కేటాయించాలని అదేవిధంగా అర్హులైన రెండు పడకల గదుల ఇల్లులు వారికి కేటాయించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండ సరైన మార్గంలో మీ యొక్క విధులు నిర్వర్తించాలని ఆదేశించడం జరిగిందిఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎమ్మార్వో అశోక్ ,డిటి పృథ్వి, మారేడ్పల్లి ఎమ్మార్వో పద్మ సుందరి ,ఆర్ ఐ మల్లేష్,సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ పాల్గొనడం జరిగింది