తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్?
అమరావతి (ధ్వని న్యూస్): తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను అధిష్టానం నిర్ణయించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఒకటి , రెండు రోజుల్లో జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాస్ నియామకాన్ని ప్రకటించనున్నారు.ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు మంత్రివర్గంలో స్థానం పొందడంతో ఆ స్థానాన్ని బీసీ యాదవ వర్గానికి దక్కనుంది. పల్లా శ్రీనివాస్‌కు అధ్యక్షపదవి ప్రకటిస్తే రెండోసారి ఉత్తరాంధ్రకు ఆ పదవి వరించనుంది. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపొందారు. సమీప వైసీపీ అభ్యర్థిపై 95,235 ఓట్లతో ఆయన గెలుపొందారు.