విన్నపాలు వినవలె
ప్రజావాణి కి దరఖాస్తుల వెల్లువ
స్వీకరించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
హైదరాబాద్, (ధ్వని న్యూస్ బ్యూరో):: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి వినతిసత్రాలు అందచేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 607 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 176, హౌసింగ్ కు సంబందించి 58 దరఖాస్తులు, పౌరసరఫరాల శాఖ కు సంబందించి 54, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖకు సంబందించి 36, హోం శాఖకు సంబందించి 62 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబందించి221 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీమతి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.