సర్కారు అలర్ట్
పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణలో భారీ వర్షాలు
ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్,(న్యూస్ బ్యూరో):తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే విధంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సంచాలకులు వివరించారు. కింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు కురుస్తున్నాయని అందిన సమాచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమమైనది.అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోరింది.