బయోమెట్రిక్ పై ఫోకస్

0
reventh
file photo

సీరియస్ గా పరిగణిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తొలుత తెలంగాణ సెక్రటేరియట్ నుంచి శ్రీకారం

అనంతరం జిల్లాలలో కూడా అమలు

హైదరాబాద్ ,ధ్వని ప్రధాన ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో మళ్ళీ పాలన పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే రుణమాఫీ అమలు చేయడానికి పక్క ప్రణాళికతో అధికారులు సిద్ధం అవ్వాలని, ఆగస్టు 15వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలననిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఉద్యోగుల సమయపాలన విషయంలో రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగుల సమయపాలన పై ఫోకస్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే మొదటగా సెక్రటేరియట్ నుండే దానికి శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు లేటుగా వచ్చి త్వరగా ఇళ్లకు వెళ్లిపోతున్నారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల సమయపాలన విషయంలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.సెక్రటేరియట్ నుండి బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచన బయోమెట్రిక్ విధానం అమలులోకి వస్తే ఉద్యోగులు కూడా టైమింగ్ పాటిస్తారని అందరికీ అందుబాటులో ఉండి పని పైన ఫోకస్ చేస్తారని రేవంత్ భావిస్తున్నారు.దీని వలన పనులలో వేగం పెరగడం కారణంగా రాష్ట్రంలో సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సెక్రటేరియట్ నుండి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని రేవంత్ అనుకున్నట్టు సమాచారం.సెక్రటేరియట్ తర్వాత జిల్లాలలో బయో మెట్రిక్ విధానం పై సమాలోచనలు జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి, మంత్రులు, సిఎస్, సెక్రటరీల నుంచి అటెండర్ వరకు ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ విధానంలో తమ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేసేలా నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొదట సచివాలయంలో ఈ విధానాన్ని అమలు చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుందని చర్చ జరుగుతోంది.అయితే ఈ విధానం నామమాత్రంగా ఉద్యోగాలను చేసే ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా షాక్ అనే చెప్పాలి. ఇక ఈ విధానాన్ని వ్యతిరేకించే వారు, అంగీకరించే అధికారులు ఎందరు ఉంటారో మరి. విమర్శలు ఎదురైనా సరే ఇది చేసి తీరాలని రేవంత్ భావిస్తున్న క్రమంలో మరి రేవంత్ రెడ్డి ఆలోచన కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది భవిష్యత్తులో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *