100 బెడ్స్ ఉన్న ప్రతి హాస్పిటల్ కి ఒక బ్లడ్ బ్యాంక్ ఉండేలా కృషి
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన కార్యక్రమంలో
రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్,(ధ్వని న్యూస్):ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రాజ్ భవన్ ఆధ్వర్యంలో ఈరోజు రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్లొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్త దాతలను అభినందించి, వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ప్రపంచ రక్త దానం దినోత్సవం సదర్భంగా ఈ కార్యక్రమం లో పాల్గొనడం శుభపరిణామం.. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరిస్తూ రక్త దానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి జిల్లా కేంద్రంలో మరియు 100 బెడ్స్ ఉన్న ప్రతి హాస్పిటల్ కి ఒక బ్లడ్ బ్యాంక్ ఉండేలా కృషిచేస్తామన్నారు.దీనివల్ల అందరికీ రక్తం అందుబాటులో ఉండటంతోపాటు, రక్త దానంపై ప్రజలకు అవగాహన పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు రెడ్ క్రాస్ వాహనాలకు రవాణా శాఖ తరుపున పన్నులు మినహాయింపు ఇవ్వాలని వినతి పత్రం అందించగా,సానుకూలంగా స్పందించి దీనిపై సాద్యాసాద్యాలు పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా అత్యధికసార్లు రక్తదానం చేసిన రక్త దాతలు మరియు రక్తదాన ప్రచారకులకు ప్రశంసా పత్రాలను మరియు అవార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, రెడ్ క్రాస్ తెంలంగాణ బ్రాంచ్ చైర్మన్ అజయ్ మిశ్రా,రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఆర్.వి. కర్ణన్, రెడ్ క్రాస్ తెంలంగాణ స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ సీఈఓ కె. మధన్ మోహన్ రావు, గవర్నర్ జాయింట్ సెక్రటరీ శ్రీ జె. భవానీశంకర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.