డ్రగ్స్ అలవాటు చేసుకొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
ఇబ్రహీంపట్నం ఏసిపి కే పి వి రాజు
ధ్వని న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కాలేజీలో బుధవారం ఆంటీ డ్రగ్స్ ఆబస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం ఏసిపి కే పి వి రాజు, సీఐ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ జీవితంలో చెడిపోయి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కాలేజీలో ఎవరైనా గంజాయి కి అలవాటు పడితే పోలీస్ వారికి తెలియజేయాలని సూచించారు. తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని, పిల్లలు స్ట్రెస్ కు కోల్పోకుండా గేమ్స్ లాంటివి వారికి స్ట్రెస్ ను కోల్పోకుండా మంచి అలవాట్లను వచ్చేలాగా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురునానక్ కాలేజీ డైరెక్టర్ వెంకట్రావు, జాయింట్ డైరెక్టర్ పార్థసారథి, ప్రిన్సిపల్ శ్రీనాథ్ రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ రిషి సాయల్, డెన్ ఆర్ అండ్ డి సంజివ్ శ్రీ వాస్తవ, జిఎం అడ్మిన్ ఎం మాజీద్ తదితరులు పాల్గొన్నారు.