ఐసిడిఎస్ కు సంబంధం లేని పనులను అప్పగించకూడదు

0

anganwadi

 అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్

నిజామాబాద్  ధ్వని న్యూస్ జిల్లా ప్రతినిధి :ఐసిడిఎస్ కు సంబంధం లేని పనులను అప్పగించటం వలన అంగన్వాడి ఉద్యో.గుల ఈరోజు సిఐటియు ఆఫీసులో ముందుగా జిల్లా విస్తృత సమావేశం నిర్వహించి సమస్యలను చర్చించడం జరిగింది ప్రధానంగా ల పేరుతో విపరీతమైనటువంటి పని వారాన్ని మోస్తూ చిన్న చిన్న సమస్యలను అడ్డుపెట్టి వేతనాల్లో కోతలు విధించడంతోపాటు గత పది నెలలుగా సెంటర్ అద్దె కానీ కూరగాయల బిల్లులు కానీ, టి. ఏ, డి .ఏ లు తల్లిపాల వారోత్సవాలు ఇతర అనేక కార్యక్రమాలు నిర్వహించటంతో ఖర్చులు చెల్లించకుండా ఆర్థిక భారాలు పెరుగుతున్నాయని అదేవిధంగా రిపోర్టుల పేరుతో రోజు రిపోర్టులను పంపడంతో పాటు 14 రకాల రికార్డులను రాసే పని పెరిగిందని అదేవిధంగా ఎన్నికల బిఎల్ఓ డ్యూటీలను వేయడంతో నెలల తరబడి వాటి పనిమీద ఉండాల్సి వచ్చిందని ఇప్పుడు అదనంగా ఐసిడిఎస్ కు సంబంధంలేని మిషన్ భగీరథ నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వీటన్నిటి ఫలితంగా అంగన్వాడి సెంటర్ల నిర్వహణ జరపటంలో నిర్లక్ష్యం ఉందని అదనపు పనులను అప్పజెప్తూనే తనిఖీల పేరుతో చిన్నచిన్న లోపాలను ఎత్తిచూపుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కావున ఐసిడిఎస్ కు సంబంధం లేని పనులను అప్పగించకూడదని జిల్లా అదనపు కలెక్టర్కు ఐసిడిఎస్ పీడీ గారికి వినతి పత్రం జరిగింది అనంతరం అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే దేవగంగు జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి చంద్రకళ జిల్లా నాయకులు సూర్య కళ, జ్యోతి ,వాణి గోదావరి ,జగదాంబ, లక్ష్మి ,యమునా ,సుజాత తదితరులతోపాటు వివిధ సెక్టార్ యు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *