మేడిగడ్డలో కాసుల పంట
ఇసుకతో కనకవర్షం
బ్యారేజ్ తో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి రూ. 800 కోట్లకుపైనే ఆదాయం
టెండర్ల ద్వారా వేలం వేయాలని నిర్ణయం
మరోసారి సంచలనంగా మారిన కాలేశ్వరం ప్రాజెక్టు
భారీ ఆదాయము రాబడిపై ముఖ్యమంత్రి
ధ్వని ప్రధాన ప్రతినిధి హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించబోతోంది. రాష్ట్ర ఖజానాకు ఇది వరంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుకమేటలు బయటపడ్డాయి. మేడిగడ్డ ఇసుకతో 800 కోట్లకు పైగా ఆదాయం దీంతో ఈ ఇసుకను తవ్వి విక్రయించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది ఈ మేరకు ఇసుకను వేలం వేయడానికి టెండర్లను కూడా ఆహ్వానిస్తుంది. మేడిగడ్డలోని ఇసుక అమ్మకం ద్వారా భారీగా ఆదాయం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ తో రాష్ట్రానికి 800 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది.
14 ఇసుక బ్లాకులను వేలం వేయాలని సర్కార్ నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేడిగడ్డ ఇప్పుడు ఊహించని విధంగా సిరుల పంటను పండించబోతోంది. మేడిగడ్డలో ఏర్పడిన ఇసుకమేటలను విక్రయించడం ద్వారా రాష్ట్రానికి 800 కోట్లకు పైగా ఆదాయం రాబోతుందన్న ప్రభుత్వ అంచనాల నేపధ్యంలో ఈ మేరకు ముందుగా 14 ఇసుక బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం.జులై మొదటివారంలో ఇసుక వేలం ఇసుక బ్లాక్ లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించింది. జులై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. అంతేకాదు త్వరలోనే మరిన్ని బ్లాక్ ల నుండి కూడా ఇసుకను వెలికి తీయాలని భావిస్తుంది. ఇక మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలోను ఇసుక లభ్యతపై జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.మేడిగడ్డలో ఇసుకతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం మొత్తానికి 200 నుండి 300 కోట్లు పెట్టి పిల్లర్లు రిపేర్ చేయించని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇసుకను అమ్మి కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా జాప్యం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం భావిస్తున్నట్టు ఇసుక వెలికితీతకు ఎటువంటి ఆటంకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని టీజీఎండిసి భావిస్తుంది.