ఘనంగా ముగిసిన ఆటా మహాసభలు
అమెరికాలో అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాల్లో ఒకట్కెన అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహించే ద్వ్కెవార్షిక మహాసభలు అట్లాంటాలోని జార్జియా వరల్జ్ ట్రేడ్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జూన్ 7 నుంచి 9వ తేదీ వరకు జరిగిన ఈ మహాసభల్లో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. 2000, 2012 సంవత్సరాల తరువాత ఈ సభలు అట్లాంటాలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ చక్కనైన సాయంత్రం ఎంతో మంది ఒక చోట సరదాగా, ఆప్యాయంగా కలిసి జరుపుకోవడం శ్లాఘనీయం. జ్యోతి ప్రజ్వలన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం మరియూ అధ్యక్షురాలు మధు బొమ్మినేని విచ్చేసిన అందరికీ ఈ వేడుకలకు సాదర స్వాగతం పలికారు. వీరితో పాటు కోర్ కమిటీ సభ్యులు కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఏ కార్యక్రమానికైనా స్పాన్సర్లు మూల స్థంబాలు, వీరు లేనిదే ఏ పనీ ముందుకు నడవదు. కోర్ కమిటీ తో పాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీస్ కలిసి స్పాన్సర్లను సగౌరవంగా సత్కరించారు. ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారిని గుర్తించి, వారి నుండి కొంత మందిని ఎంపిక చేశారు, వీరికి ఆటా అవార్డులు ప్రధానం చేయడం జరిగింది. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునాయి.తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్లలతో పాటు ధ్వని,శుభలాబ్ దినపత్రికల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.సాయికుమార్‌రెడ్డి,అమెరికాలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఛైర్‌మెన్,తెలుగు ప్రముఖులు గుడే రమేష్‌లు, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూత లూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఒక ఎత్తు. యువత ప్రత్యేకంగా కలవడం, కార్యక్రమాలు చేసుకోవడం, విడిగా భోజనాలు చేయడం ఆటా వారు వీరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తుంది. నవత, యువత, భవితకు ఆటా పెద్ద పీట వేస్తుందని ప్రెసిడెంట్ మధు బొమ్మినేని చెప్పి, వీటి ప్రాముఖ్యాన్ని విశదీకరించారు. ఇంకా ఎన్నో ఆకట్టుకునే ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ, అందరూ హాజరు కావాలని కోరారు. అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుండి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదల య్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు విపులీకరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తులు సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహము. ఉమెన్స్ ఫోరమ్ లో సినీ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ పాల్గొని ఆశ్చర్య పరిచారు. మెయిన్ స్టేజీపై పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. టాలీవుడ్ నటి నేహా శెట్టి, సినీ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులను సన్మానించారు. ఆటా కార్యనిర్వాహక సభ్యులను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ని, వివిధ కమిటీల ఛ్కెర్స్, కో-ఛ్కెర్స్ తదితరులను వేదికమీదకు పిలిచి అభినందించారు. టాలీవుడ్ డాన్స్ మాస్టర్ సత్య, నటీమణులు సౌమ్య, అంకిత, సరయు కలిసి వేసిన డాన్స్ ప్రోగ్రాంకి మంచి స్పందన వచ్చింది. ఇండియా నుంచి విచ్చేసిన పరంపర ఫౌండేషన్ వారు ప్రదర్శించిన గుడి సంబరాలు నృత్యానికి సభికులందరూ నుంచొని మరీ కరతాళధ్వనులతో అభినందించారు. .ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని మరియు కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం తమ సందేశం వినిపించారు. చివరిగా టాలీవుడ్ మ్యూజిక్ డ్కెరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ట్రూప్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.. అమెరికాలోని పలు నగరాలలో రాబోయే మెగా 18వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా, ఇటీవల అసాధారణమైన ప్రతిభ, క్రీడాస్ఫూర్తి మరియు సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. పాల్గొన్న వారికి మరియు ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు / బాలురు మరియు మహిళలు / బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహ పూరితంగా సాగడం ఆటా వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి.ఆటా స్పోర్ట్స్ టీమ్ నేతృత్వంలో సువానీలోని ఏ బి సి సెంటర్ లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్‌లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. చివరిరోజున భద్రాచల దేవస్థానం వారి శ్రీ సీతారాముల కల్యాణం భక్తి పారవశ్యంలో ముంచింది.. భద్రాచల పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది పండితులు,5వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కళ్యాణంలో వ్యాఖ్యాతగా శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా॥ బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి వ్యవహరించారు. ఈ కార్యక్రమం ఆట్లాంటా నగరంలోని ప్రొఫెసర్ సుంకర రంగారావు,శ్రీమతి సుంకర గీత ఎడ్వైజర్‌లుగా వారి ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించబడిరది. సాహితీ సదస్సులు, ఉమెన్స్ ఫోరమ్, కంటిన్యూఇంగ్ మెడికల్ ఎడ్యుకేషన్, బిజినెస్ ఫోరమ్, యూత్ ఇన్నోవేషన్స్, స్పిరిచువల్ ఫోరమ్, దాజి హెర్ట్ఫుల్నెస్ సెషన్స్, పొలిటికల్ ఫోరమ్ వంటి కార్యక్రమాలు వివిధ బ్రేకవుట్ రూమ్స్‌లో నిర్వహించారు.