జూన్ 19 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు
అమరావతి (ధ్వని న్యూస్ );ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, వపన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరిపాలనపై కొత్త ప్రభుత్వం దూకుడు చూపిస్తోంది. ఈ క్రమంలో జూన్ 19 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4 రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.సమావేశాలు సందర్భంగా తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, అసెంబ్లీ సమావేశాల కంటే ఒక రోజు ముందు..18న కేబినెట్ తొలి సమావేశం జరిగే అవకాశం ఉంది.