kcr
file photo

కేసీఆర్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం కష్టమేనా?

ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్, (న్యూస్ బ్యూరో):తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి వరుసగా ప్రాభవాన్ని కోల్పోతున్న బిఆర్ఎస్ పార్టీ తాజా పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పీకల లోతు కష్టాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందని, పార్టీ మళ్లీ కోలుకోవడం కష్టమేనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.పదేళ్ళు ఏకచత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ పదేళ్లు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాజా పరిస్థితి నుంచి గట్టెక్కే మార్గం ఉందా? అన్న అంశం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి పదేళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగించింది.దేశ రాజకీయాల కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా తెలంగాణ రాష్ట్ర సీఎం గా కెసిఆర్, ఆయన తనయుడు కేటీఆర్ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రతిపక్ష పార్టీలను చావు దెబ్బ కొట్టేలా, ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను ఆహ్వానిస్తూ, ప్రతిపక్షాలలో కీలక నాయకులు లేకుండా చేసి తీవ్రమైన దెబ్బ కొట్టారు. ఇక రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని పార్టీగా భావించి, దేశ రాజకీయాలను చేయాలని టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చారు.వరుసగా అన్ని ఎన్నికల్లోనూ చావుదెబ్బ దేశ్ కి నేత కెసిఆర్ అంటూ ప్రధాని రేసులో కేసీఆర్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక 10 ఏళ్లపాటు కెసిఆర్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు గత ఎన్నికలలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే కాదు, జరిగిన లోక్సభ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సైతం బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఊహించని షాకిచ్చారు.ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా రాకుండా బిఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చూడాల్సి వచ్చింది. ఒకవైపు కెసిఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉండడం, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ టాపింగ్ కేసు విచారణలో కెసిఆర్, కెసిఆర్ తనయుడు కేటీఆర్ ఉన్నారని ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడం తలనొప్పిగా మారింది,గత వైభవం కష్టమే రాష్ట్రంలో ప్రజలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆసక్తి లేనట్టు ఇచ్చిన ప్రజల తీర్పు వెరసి బిఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడింది. అయితే ఈ ప్రమాదం నుండి బయటపడడం కష్టమే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప, మళ్లీ బి ఆర్ ఎస్ పార్టీ గత ప్రాభవాన్ని సంపాదించలేదు అనేది రాజకీయ విశ్లేషకుల మాటగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *