కిషన్ రెడ్డి దంపతులకు ఘన స్వాగతం
న్యూఢిల్లీ, (ధ్వని న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీలోనీ, అశోక్ రోడ్ 6 నివాసానికి సతీసమేతంగా చేరుకున్న జి.కిషన్ రెడ్డి దంపతులకు అంబర్పేట్ భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు ఎక్కాల నందు, బిజెపి జాయింట్ కన్వీనర్ ఏడెల్లి అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.