స్కూల్ జీవితం ఓ మధుర జ్ఞాపకం

0

school
2003-2004 టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కారేపల్లి ధ్వని న్యూస్ :స్కూల్ జీవితం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయి 20ఏళ్లకు మళ్ళీ అందరూ ఒక చోట కలవడం తో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకే దగ్గర చదువుకొని పదో తరగతి పరీక్షలు రాసి ఎవరి దారిన వారు వెళ్లిపోయిన పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట కలిసి మళ్లీ ఆ పాత జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆనందాల్లో మునిగితేలారు. కారేపల్లి మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003-2004బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి స్కూల్ జీవితం ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిందని 20 ఏళ్ల తర్వాత అందరూ ఒకే చోట కలుసుకోవడంతో నాటి పూర్వ విద్యార్థులు ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నాటి పూర్వ ఉపాధ్యాయులు రామయ్య, ఝాన్సీ , భారతి, బ్రహ్మ రెడ్డి ,శ్రీలత ,ఉమా శ్రీనివాసరావు , భీమవరపు శ్రీనివాసరావు ,విజయ కుమారి ,పద్మావతి ,రెబక ముఖ్యఅతిదులుగా పాల్గొన్నారు. వారిని విద్యార్థులంతా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పరిచయాలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. గడిచిన 20సంవత్సరాలుగా కోల్పోయిన సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ 20ఏళ్ల తర్వాత విద్యార్థులంతా ఒకచోట కలుసుకుని వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులంతా వివిధ రంగాల్లో కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ ధర్మాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకెళ్లడం సంతృప్తినిస్తుందని అన్నారు. బాల్యాన్ని వెనుకకు తీసుకురావడం కష్టమని అయితే నాటి బాల్యంలో ఉన్న జీవిత సంతోషాలను కొనసాగించేలా మార్చుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో వీరభద్రం ,ఆలిం ,మురళి, ప్రసాద్, సుధాకర్ , సంపత్ ,సత్యం, రాజు ,నూర్జహాన్ ,కరుణ, స్వాతి ,హేమ , ఉమా ,సురేష్ , నాగాచారి ,సమీర్, నాగరాజు, శివరాణి, రాధిక, సరిత పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *