రామోజీరావు కు టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ సంతాపం
ఖమ్మం ( ధ్వని న్యూస్ ప్రతినిధి) ఈనాడు ఈటీవీ సంస్థల అధినేత పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతికి టి యు డబ్ల్యూ జే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి లు ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.*దాదాపు 5 దశాబ్దాల పాటు జర్నలిస్ట్, సినీ రంగంలో రాణించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమాటింపజేసిన రామోజీరావు తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారని, ఆయన వయసు రీత్యా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఈనెల 5న హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారని తెలిపారు.*రామోజీరావు మృతి చెందడం పట్ల తీవ్ర సంతపాన్ని ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.