నేటి నుండి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం
సిద్దిపేట టౌన్ ( ధ్వని న్యూస్ ) : ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి ఒక ప్రకటన తెలిపారు.ఎన్నికల కోడ్ ముగిసినందున సమీకృత జిల్లా కార్యాలయాల సమాదాయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లాలోని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.