గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్
సిద్దిపేట టౌన్ జూన్ 10 ( ధ్వని న్యూస్ ) :సిద్దిపేట పట్టణం హిందూ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సురభి మెడికల్ కాలేజ్, మిట్టపల్లి వెల్కటూర్ ఎక్స్ రోడ్ టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ లలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ గ్రూప్ వన్ ఎగ్జామ్ పోలీస్ నోడల్ అధికారి ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీసీపీ అడ్మిన్ ఎస్ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపి మధు, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.