వామ్మో జూన్ వచ్చేసింది

0

ఫీజుల భారం..మొదలయ్యింది..!
బడి ఫీజుల మాట వింటేనే భయపడుతున్న తల్లిదండ్రులు
సంపాదనలో సగం మేరకు బడి ఫీజులకే మాయం
_ఫీజుల నియంత్రణకు పలువురి డిమాండ్
కల్వకుర్తి)జూన్ 9/(ధ్వని న్యూస్ కల్వకుర్తి ప్రతినిధి):-నాగర్ కర్నూల్ జిల్లా పేద,మధ్యతరగతి కుటుంబాలు జూన్ వచ్చిందంటేనే భయపడిపోతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవు తుందని తలుచుకుంటేనే తల్లిదండ్రుల్లో గుబులు మొదలవుతుంది.నాలుగేళ్ల పిల్లాడు ఎల్ కెజిలో చేరాలంటే అక్షరాలా రూ.25 వేలు చెల్లించాల్సిందే,ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే, దీంతో పాటు డొనేషన్,బిల్డింగ్ ఫండ్,రిజి స్ట్రేషన్ ఫీజు,అడ్మిషన్ ఫీజు,రవాణా,యూనిఫాం, పుస్తకాలు,పెన్నుల ఖర్చులు అదనం. అంతా కలిపి ఒక్కొ పిల్లాడు ఎల్కెజి పూర్తి చేయడానికి రూ.50 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.తరగతి పెరిగే కొద్దీ ఈ ఫీజులు కూడా పెరిగిపోతుంటాయి.పదో తరగతి చదవడానికి రూ.లక్షన్న రకు పైగా ఖర్చు చేయక తప్పడం లేదు.విద్య పేరిట కార్పొరేట్ సంస్థలు చేస్తున్న వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది.ఫీజులు చెబితేనే విద్యార్థుల తల్లితండ్రుల ఫ్యూజులు ఎగిరిపోయే పరిస్థితి నెలకొంది. ఏటా జూన్లో ఇదే పరిస్థితి ఉన్నా ఇందుకోసం తల్లిదండ్రులు ఆదాయంలో 59శాతం ఖర్చు చేస్తున్నారు.ప్రతి ఏటా 10 శాతానికి పైగా ఫీజులు పెరుగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఎలెకెజికి రూ.25వేలు,6వ తరగతి నుంచి పాఠశాల ఏ సీటు కావాలన్నా కనీసం రూ. అర లక్ష ఖర్చు చేయాల్సి వస్తోంది.సంపాదనలో సగం మేరకు ఫీజులకే.. పేద,మధ్య తరగతి కుటుంబాల్లో తల్లిదండ్రుల సంపాదనలో ప్రతి నెల సగం డబ్బులు బడి ఫీజులకే ఖర్చు అవుతుందంటే ఆశ్చర్యం లేదు. జ్రాూన్ నెల 12వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయనే మాట వింటేనే మిడిల్ క్లాస్ కుటుంబాలు ఇప్పటి నుండే అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల ఫీజులతో పాటు పాఠశాలల్లో యూనిఫాం, డైరీ, టై, బెల్ట్, బూట్లు అంటూ అధిక మొత్తంలో తల్లిదండ్రుల నుండి లాగుతున్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలో ఫీజులపై ప్రభుత్వం నియంత్రణ తీసుకువచ్చే వీధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాలలో నియమించే పేరెంట్స్ కమిటీలో కూడా పాఠశాలల యాజమాన్యం అనేక తప్పిదాలకు పాల్పడుతుంది. పాఠశాల యాజమాన్యంకు అనుకూలంగా ఉన్న వారిని పేరెంట్స్ కమిటీ సభ్యులుగా నియామకం చేసి ఎలాంటి సమావే శాలు నిర్వహించకుండానే పేరెంట్స్ కమిటీ ఆమోదం మేరకే ఫీజులు వసూలు చేయడం జరుగుతుందని అయాయక తల్లిదండ్రులను మోసం చేస్తు న్నారు.విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి పాఠశాలలో సౌకర్యాలను పర్యవేక్షించి ఫీజుల నియంత్రణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *