కుప్పం ముద్దుబిడ్డగా పుడతా
ఏపీ ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం
ఏపీ సీఎం చంద్రబాబు
కుప్పం, (ధ్వని న్యూస్ బ్యూరో):ఏపీలోని కుప్పం నియోజకవర్గం తన రాజకీయాలకు ప్రయోగ శాల అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు, స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు.మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. తాను ఇక్కడకు వచ్చినా, రాకున్నా తనను ఆదరించారని తెలిపారు. ఇప్పటి వరకు 8 సార్లు కుప్పం నుంచి గెలిచానని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్సీపీని చిత్తుచిత్తుగా ఓడించారని పేర్కొన్నారు. అహంకారంతో విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పడానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు, స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం. కుప్పం నియోజకవర్గం నా రాజకీయాలకు ప్రయోగ శాల. యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చాం. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కేబినెట్లో 8 మంది బీసీలకు అవకాశం ఇచ్చాం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం, అమరావతికి వెళ్లా. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసమే కుప్పం వచ్చా. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా. కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. కుప్పంను అన్నింట్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తా”నని స్పష్టం చేశారు.అందుకే కుప్పంను ఎంచుకున్నా : తాను వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ పాలన పీడకల అలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఏ తప్పూ చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైలులో పెట్టారని ఆవేదన చెందారు. కుప్పం ప్రశాంతమైన స్థలం ఇక్కడి హింసకు చోటు లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు జాగ్రత్త అని హెచ్చరించారు. ఐదేళ్లలో కుప్పంలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆవేదన చెందారు. అయితే ఇప్పుడు కుప్పంను మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు.కుప్పంలో ఔటర్ రింగ్‌రోడ్ వేస్తాం, ఆధునిక రోడ్లు వేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలోని 4 మండల కేంద్రాలనూ ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. కుప్పం అభివృద్ధికి సంబంధించిన పనులు ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతాయని చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజ్‌లు, వీధిదీపాలు ఏర్పాటు చేస్తామన్నారు.”ఏ కుటుంబంలోనూ పేదరికం ఉండకూడదన్నదే నా ఆశయం. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తాం. వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం వస్తుంది. కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తాం. ఇంటికి రెండు ఆవులు ఇస్తే ఆ రోజు నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు కుప్పంలో 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్రి అవుతున్నాయి. తాజాగా ఆ సంఖ్యను 10 లక్షల లీటర్ల ఉత్పత్తి అయ్యేలా చూస్తాం. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తాం. కుప్పంలో తేనె ఉత్పత్తి మరింత పెరిగేలా చర్యలు. కుప్పం బస్టాండ్, డిపో రూపురేఖలు మారుస్తాం. మల్లన్న, రాళ్లమణుగూరును మండలాలు చేస్తాం. కుప్పంకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తాం అని చంద్రబాబు అన్నారు.