వడివడిగా రహదారులు-కోమటిరెడ్డి

0

ko

తెలంగాణలో హైవేల నిర్మాణాలను వేగవంతం చేయండి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్ 25: మంగళవారం సాయంత్రం 05.00 గంటలకు న్యూఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో సమావేశమైన గౌరవ రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి . రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రహదారుల సమస్యల పరిష్కారం.. పలు జాతీయ రహదారుల మంజూరీ గురించి విన్నవించారు. గత పదేండ్లుగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగడం వల్ల వేలాదిమంది అమాయకులైన ప్రజలు చనిపోతున్న విషయం వారి దృష్టికి తీసుకువచ్చిన మంత్రి.. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు.. వెంటనే జాతీయ రహదారుల నిర్మాణానికి పచ్చజెండా ఊపాలని విన్నవించారు. అందులో..

1. ప్రధానంగా బి ఓ టి  కన్సెషనరీ జి ఏం ఆర్  సంస్థ వివాదం పరిష్కరం కోసం ఎదురుచూడకుండా “హైదరాబాద్ – విజయవాడ” ఎన్ హెచ్-65 రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించి.. వాహన రద్దీ కారణంగా ప్రమాదాల్లో చనిపోతున్న అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలి.

2. ఎన్ హెచ్-163 (హైదరాబాద్ – మన్నెగూడ) రోడ్డుకు ఉన్న ఎన్ జి టి  సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొని, ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలి.

3. అధిక వాహన రద్దీ మూలంగా.. తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న ఎన్ హెచ్-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్  తయారీ ప్రక్రియని వేగవంతం చేయాలని కోరగా.. వారు తక్షణం డీపీఆర్ తయారీ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.పైన పేర్కొన్న రహదారుల నిర్మాణంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రహదారుల గురించి సవివరంగా మ్యాపులతో కూడిన ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి.. వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చొరవ చూపాలని కోరారు. గౌరవ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి వినతులపై సానుకూలంగా స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్.. అధికారులతో సవివరంగా చర్చించి, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇంజనీర్ -ఇన్-చీఫ్ (ఆర్&బీ) ఐ.గణపతి రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *