21 కేబినెట్ సమావేశం
హైదరాబాద్(ధ్వని న్యూస్): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 21వ తేదీన జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అధికార చిహ్నం, జిల్లాల తగ్గింపు, విభజన అంశాల్లోని 9, 10 షెడ్యూల్‌కు సంబంధించిన ఆస్తులు, ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఎపి, తెలంగాణ ఉద్యోగుల అంశాల గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.కాళేశ్వరంతో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సం బంధించిన కమిషన్‌ల విచారణ కాలం పెంపుతో పాటు కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎన్‌డిఎస్‌ఏ నివేదికతో పాటు ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలకు నిధుల సమీకరణ తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.