పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధ చట్టంపై అవగాహనా కార్యక్రమం
ధ్వని న్యూస్ సూర్యపేట జిల్లా ప్రతినిధి:మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం వారు స్థానిక సూర్యాపేట పట్టణంలో గల మాంగళ్య షాపింగ్ మాల్ నందు పనిప్రదేశంలో లైంగిక వేధింపులు నిరోధ చట్టంపై అవగాహనా కల్పించడం జరిగింది ఈ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సాధికారత కేంద్రo డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ మాల్ నందు పనిచేస్తున్న మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధ చట్టం యొక్క ప్రాముఖ్యత తెలియచేస్తూ పదిమందికి మించి పనిచేస్తున్న ప్రతి ప్రదేశంలో ఏర్పాటు చేయవలసిన అంతర్గత పిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు గురుంచి మరియు స్థానిక పిర్యాదుల కమిటీ(LCC) యొక్క అవశ్యకత దానియొక్క పరిధిని తెలియచేయడం జరిగింది అదేవిదంగా ఆ కమిటీల పనితీరుని వివరించడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాంగళ్య షాపింగ్ మాల్ మేనేజర్ రవి మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రేవతి వినోద్ ఫైనాన్సియల్ లిటరసి తేజస్విని మరియు షాపింగ్ మాల్ మేనేజర్2 సౌరాబ్ మరియు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు