గంగానదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గల్లంతు
ఉత్తరాఖండ్ ;రాజధాని నగరానికి 70 కిమీ దూరంలో బార్హ్ పట్టణ సమీపంలో ఆదివారం ఉదయం గంగానదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గల్లంతయ్యారు. మొత్తం 17 మంది ఈ పడవలో ప్రయాణిస్తుండగా, పడవ బోల్తా పడి అందులోని 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలిగారు. మిగతా ఆరుగురు గల్లంతైనట్టు సమాచారం . ఉమానాథ్ గంగా ఘాట్ సమీపం లో ఉదయం 9.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని బార్హ్ సబ్‌డివిజనల్ ఆఫీసర్ శుభం కుమార్ తెలిపారు.. జిల్లా యంత్రాంగం, పోలీస్ సిబ్బంది ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నలంద నుంచి పడవలో వచ్చిన వీరు అంత్యక్రియల తరువాత స్నానానికి గంగానది అవతలవైపు పడవలో వెళ్తుండగా ఈప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మునిగిపోయిన వారిలో ఎన్‌హెచ్‌ఏఐ మాజీ ప్రాంతీయ అధికారి అవధేష్ కుమార్, ఆయన కుమారుడు ఉన్నారు.