బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
హైదరాబాద్,(ధ్వని న్యూస్): కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే సమగ్ర కుల గణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..బీసీ కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వద్ద ఇందిరాపార్కు మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా గౌరవ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్, కవి, రచయిత సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఏబీసీ వ్యవస్థాపకుడు, బీసీ టైమ్స్ సంపాదకుల సంగెం సూర్యారావు, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు యూనివర్సల్, టి.జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ సంజీవ్ నాయక్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్, అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, బీసీ ఐక్యవేదిక చైర్మన్ కాటంనర్సిహ్మ యాదవ్ తదితరులు హాజరు కానున్నారు.ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఫోటోగ్రాఫర్, వీడియో సిబ్బందితోపాటు మీ కరస్పాండెంట్‌ను డిప్యూట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే సమగ్ర కుల గణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..బీసీ కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వద్ద ఇందిరాపార్కు మహాధర్నా నిర్వహిస్తున్నాం అని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ తెలిపారు.