కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరణ
న్యూ ఢిల్లీ ;: ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో బిజెపి గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందన్నారు. తమ ఓటింగ్ శాతం అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్ సభ ఎన్నికల నాటికి 14 శాతం నుంచి 36 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓటర్లు కూడా లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బిజెపికి వేశారని తెలిపారు.