గ్రీన్ సిటీగా రాజధాని

0

ponnam

బ్రాండ్ ఇమేజ్ కీలకం

హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి కలిసి పనిచేయాలి

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

హైదరాబాద్, (ధ్వని న్యూస్ బ్యూరో):వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. నగరవ్యాప్తంగా వాటర్ లాకింగ్ పాయింట్స్ గుర్తించి, వర్షం పడిన వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లి నీరు నిల్వకుండా చూస్తారని మంత్రి వెల్లడించారు.రాబోయే వన మహోత్సవంలో హైదరాబాద్‌ గ్రీన్‌ సిటీగా మార్చాలని చర్చించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్, నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే పరిష్కరించేలా అప్రమత్తంగా ఉండేలా చూడాలని మంత్రి తెలిపారు. బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. బోనాల పండుగకు సంబంధించి మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో వర్షం పడిన వెంటనే వాటర్ లాకింగ్ పాయింట్స్ గుర్తించి, సదరు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా సిబ్బంది చూస్తారని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించామన్నారు. హైదరాబాద్ ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమలు లేకుండా చూసుకోవాలని అప్పుడే వ్యాధులను అరికట్టవచ్చునని వివరించారు.వర్షం పడినప్పుడు ప్రజల సహకారం కావాలని మంత్రి కోరారు. మాన్ హోల్స్‌పై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నగరంలో వర్షపు నీరు నిలిచే 141 ప్రాంతాలను గుర్తించామని, అక్కడ నుండి నీటిని తొలగించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం పక్షాన జీహెచ్‌ఎంసీకి ఎప్పటికీ సహకారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఏ సమస్య ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. వారం రోజుల్లో జిల్లా మంత్రిగా అనేక వార్డుల్లో, డివిజన్‌లలో తిరుగుతూ వారి సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు. నాళాల్లో సిల్ట్ తీయడంపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. సిల్ట్ తీయడంపై అవినీతి జరిగిందంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నగరంలో శానిటేషన్ సమస్య ఉందని, దానిని అధిగమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో ఇంటర్నల్ రోడ్లు డ్యామేజ్ లేకుండా చూస్తున్నామని, గుంతలు పుడుస్తున్నామన్నారు. పురాతన భవనాలకు సంబంధించిన వాటిని గుర్తించాలని, నివాసయోగ్యం కానీ వాటిని గుర్తించి అందులో లేకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. నగర సమస్యలపై వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లను సలహాలు కోరుతున్నాము. ఏ సమస్య వచ్చిన అందరం కలిసి ముందుకు వెళదాం. హైదరాబాద్ అభివృద్ధికి అందరం పనిచేద్దాం. జీహెచ్‌ఎంసీ ముందుకు సమస్య రాకముందే పరిష్కార మార్గాన్ని అన్వేషించాలిస్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *