సిద్దిపేట ఆస్పత్రిని పరిశీలించిన హరీశ్ రావు
సిద్దిపేట ధ్వని న్యూస్ :సిద్దిపేట సర్వజన ఆసుపత్రిని మాజీ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. రోగులు, వారి బంధువులను ఆత్మీయంగా పలకరిస్తూ, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆర్ఎమ్ఎమ్, ఇతర వైద్యులు, సిబ్బందితో కలసి అన్ని విభాగాలను తనిఖీ చేశారు. కార్పొరేట్ వైద్యానికి దీటుగా నాణ్యమైన వైద్య సేవలకు పెట్టింది పేరైన సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి ఇకపైనా మెరుగైన సేవలు అందించాలన్నారు.