శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని కు ఢిల్లీ నుండి పిలుపు
బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ చోటు
అమరావతి : కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురికి చోటుదక్కింది. వీరిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాగా, మరొకరు బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు కేబినెట్ హోదా కల్పించనుండగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి హోదా దక్కనుంది. ప్రధానితో పాటు రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాసవర్మ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పదవులు దక్కిన నేపధ్యంలో చంద్రబాబు నాయుడు రామ్మోహన్‌నాయుడుకి, పెమ్మసానికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణ నుంచి కేంద్రమంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు పిలుపు అందింది. పీఎంవో పిలుపుతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మోదీ నివాసానికి వెళ్లారు.
కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌లకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.